హిజ్రాలకు టీడీపీ నేతల టోకరా | TDP Leaders Cheated Hijras By Promising To Give Them House Site Pattas In Anantapur, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల పేరిట హిజ్రాలకు టీడీపీ నేతల టోకరా

Aug 1 2025 9:37 AM | Updated on Aug 1 2025 11:35 AM

Tdp Leaders Cheated Hijras By Promising To Give Them House Site Pattas

సాక్షి, అనంతపురం: ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు హిజ్రాలను మోసం చేశారు. నగరంలోని లెక్చరర్స్‌ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు  మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు.

ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్‌బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.

తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు.  దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement