వీడియోకాన్ నుంచి 3జీ స్మార్ట్‌ఫోన్‌లు | Videocon Mobiles launches eight 3G smartphones | Sakshi
Sakshi News home page

వీడియోకాన్ నుంచి 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Oct 5 2013 3:00 AM | Updated on Sep 1 2017 11:20 PM

వీడియోకాన్ మొబైల్స్ కంపెనీ ఇన్ఫినియమ్ సిరీస్‌లో ఎనిమిది 3జీ మొబైల్ ఫోన్లను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: వీడియోకాన్ మొబైల్స్ కంపెనీ ఇన్ఫినియమ్ సిరీస్‌లో ఎనిమిది 3జీ మొబైల్ ఫోన్లను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరలు రూ.6,000 నుంచి రూ.15,000 రేంజ్‌లో ఉన్నాయని వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ సీఈవో జెరోల్డ్ పెరీరా చెప్పారు. వచ్చే ఏడాది మార్చి కల్లా కనీసం మరో ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి తెస్తామని, అప్పటికల్లా తమ మార్కెట్ వాటా 5 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. మారుతున్న వినియోగదారుల అభిరుచులకనుగుణంగా అందుబాటు ధరల్లో ఈ ఫోన్లను అందిస్తున్నామని వివరించారు. తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసేవారు, పైస్థాయి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ కావాలనుకునేవారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్‌లనందిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

పోల్

Advertisement