పార్టీ కార్యకర్తను కొట్టిన యూపీ మంత్రి | Uttarpradesh minister slaps, punches party worker | Sakshi
Sakshi News home page

పార్టీ కార్యకర్తను కొట్టిన యూపీ మంత్రి

Jan 21 2014 1:53 PM | Updated on Sep 2 2017 2:51 AM

పార్టీ కార్యకర్తను కొట్టిన యూపీ మంత్రి

పార్టీ కార్యకర్తను కొట్టిన యూపీ మంత్రి

ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ అంటేనే రౌడీలు, గూండాలకు ప్రసిద్ధి అంటారు. ఓ మంత్రిగారు ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ అంటేనే రౌడీలు, గూండాలకు ప్రసిద్ధి అంటారు. ఓ మంత్రిగారు ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. పార్టీ కార్యకర్త ఒకరిని చెంపమీద కొట్టి, పిడిగుద్దులు కురిపించారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగిపోతోందని చెప్పడమే అతడు చేసుకున్న పాపం. రాష్ట్ర పీడబ్ల్యుడీ శాఖ మంత్రి సురేంద్ర పటేల్ అందరూ చూస్తుండగా వారణాసిలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా ఇలా కార్యకర్తను కొట్టారు.

పార్టీ మద్దతుదారులు తమ సమస్యలు చెప్పుకొంటుండగా, కొంతమంది పార్టీ సభ్యులే గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆ కార్యకర్త చెప్పారు. వెంటనే మంత్రిగారు అతగాడివైపు దూకి, చెంపమీద కొట్టారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు కురిపించారు. మరోమంత్రి శివపాల్ సింగ్ యాదవ్ అనుచరుడైన పటేల్.. కార్యకర్తను తీవ్రంగా హెచ్చరించడంతో అతడు రెండుచేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. ఇదంతా టీవీ కెమెరాలకు ఎంచక్కా చిక్కింది. సొంత పార్టీ కార్యకర్తలనే మంత్రులు ఇలా కొడుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement