రూమ్మేట్పై కత్తితో దాడి చేసిన మహిళ | US woman stabs roommate for playing The Eagles songs | Sakshi
Sakshi News home page

రూమ్మేట్పై కత్తితో దాడి చేసిన మహిళ

Sep 18 2013 1:29 PM | Updated on Aug 24 2018 5:25 PM

ఇష్టంలేని సంగీతం వినిపించాడన్న కోపంతో ఓ అమెరికా మహిళ తనతో కలిసివుంటున్న వ్యక్తిపై కత్తితో పొడిచింది.

ఇష్టంలేని సంగీతం వినిపించాడన్న కోపంతో ఓ అమెరికా మహిళ తనతో కలిసివుంటున్న వ్యక్తిపై కత్తితో పొడిచింది. మద్యం మత్తులో ఆమె ఈ దురాగతానికి పాల్పడింది. దక్షిణ కరోలినాలో ఉంటున్న వెర్నెట్ బాడర్(54) అనే మహిళ 14 అంగుళాల కత్తితో 64 ఏళ్ల రూమ్మేట్పై పలుమార్లు దాడి చేసిందని స్థానిక మీడియా తెలిపింది.

ఉత్తర చార్లెస్టన్ తన ఇంట్లో ఉండగా బాడర్ రూమ్మేట్ టీవీ చూస్తూ 'ద ఈగల్స్' మ్యూజిక్ వింటున్నాడు. అయితే తనకు ఇష్టం లేని మ్యూజిక్ పెట్టాడనే కోపంతో అతడిపై బాడర్ కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడి చేతులకు తీవ్రగాయాలయ్యాయని వీరితో కలిసివుంటున్న మరో వ్యక్తి పోలీసులకు తెలిపాడు. బాధితుడు బాడర్ చేతిలోని కత్తిని లాక్కున్నప్పటికీ మరో కత్తి తీసుకొచ్చి దాడికి పాల్పడిందని వివరించారు.

బాడర్పై గృహహింస నిరోధక చట్టం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. బాడర్ తో సహజీవనం చేస్తున్నట్టు బాధితుడు వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement