తెలంగాణ బిల్లుపై అన్నివైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభింయింది.
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై అన్నివైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభింయింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో సవరణలు చేసేందుకు సిద్ధమయింది. ప్రధాని నివాసంలో ఈ సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రలో కలపాలనుకున్న పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది.
ఖమ్మం జిల్లాలోని 134 గ్రామాలను మాత్రమే సీమాంధ్రకు బదలాయించాలని భావిస్తోంది. ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలని అంతకుముందు కేబినెట్ నిర్ణయించింది. దీన్ని తాజా సమావేశంలో ఉపసంహరించుకుంది. ఏడు మండలాల స్థానంలో 134 గ్రామాలను మాత్రమే సీమాంధ్రకు బదలాయించాలని, మిగతా వాటిని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది.