ముజఫర్నగర్లో ఉమాభారతి అరెస్టు | Uma Bharti arrested, questions Sonia trip | Sakshi
Sakshi News home page

ముజఫర్నగర్లో ఉమాభారతి అరెస్టు

Sep 17 2013 8:17 PM | Updated on Mar 29 2019 9:18 PM

ముజఫర్నగర్లో ఉమాభారతి అరెస్టు - Sakshi

ముజఫర్నగర్లో ఉమాభారతి అరెస్టు

ముజఫర్నగర్లో పర్యటనకు వెళ్లిన బీజేపీ అగ్రనాయకురాలు ఉమాభారతిని హైడ్రామా నడుమ పోలీసులు అరెస్టుచేశారు.

ముజఫర్నగర్లో పర్యటనకు వెళ్లిన బీజేపీ అగ్రనాయకురాలు ఉమాభారతిని హైడ్రామా నడుమ పోలీసులు అరెస్టుచేశారు. తనను అరెస్టు చేసినప్పుడు.. కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను మాత్రం ఎందుకు పర్యటనకు అనుమతించారని ఆమె ప్రశ్నించారు. మతఘర్షణల బాధితులలో ఒకరైన పాత్రికేయుడు రాజేష్ వర్మ ఇంట్లోకి వెళ్లేందుకు ఉమాభారతి ప్రయత్నించారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె ఓ పోలీసు కంటింజెంటులోకి పరుగు తీశారు. రాజకీయ నాయకులు ముజఫర్నగర్లో ప్రవేశించడంపై నిషేధం ఉన్న పక్షంలో సోనియా, రాహుల్ గాంధీలను మాత్రం ఎందుకు అనుమతించారని ఉమాభారతి పోలీసులను నిలదీశారు. వారు ప్రధాని మన్మోహన్ సింగ్ కాన్వాయ్లో భాగంగా వచ్చారని పోలీసులు చెప్పినా.. ఆమె సంతృప్తి చెందలేదు.

దీంతో ఆమె రాస్తారోకో, ధర్నాలకు దిగగా పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఆమెను తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా వందలాది మంది కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. యూపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భద్రతను కాపాడటంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. నాయకులందరినీ ముజఫర్నగర్లో పర్యటించేందుకు అనుమతించాలని బీజేపీ నాయకుడు వినయ్ కతియార్ కూడా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement