విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు | UK police officers filmed selfies at air crash site | Sakshi
Sakshi News home page

విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు

Sep 8 2015 7:08 PM | Updated on Sep 3 2017 9:00 AM

విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు

విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు

విమాన ప్రమాదం జరిగి 11 మంది మరణిస్తే.. అక్కడకు వెళ్లిన ఇద్దరు యువ పోలీసు ఆఫీసర్లు అక్కడ జరగాల్సింది చూడకుండా.. వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు!

విమాన ప్రమాదం జరిగి 11 మంది మరణిస్తే.. అక్కడకు వెళ్లిన ఇద్దరు యువ పోలీసు ఆఫీసర్లు అక్కడ జరగాల్సింది చూడకుండా.. వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు! దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన లండన్లో జరిగింది. వీళ్లిద్దరూ బ్రిటిష్ పోలీసు విభాగంలో కొత్తగా చేరారు. విమానం కూలిన ప్రాంతానికి కొద్ది దూరంలో వాళ్లు కార్డన్ సెర్చ్ చేయాల్సి ఉంది.

అయితే, ఆ పని చేయకుండా వెళ్లి కూలిన విమానం సమీపంలో సెల్ఫీలు తీసుకున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ల బంధువులు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. వాస్తవానికి ప్రమాదంలో మరో 16 మంది గాయడపడ్డారు కూడా. దాంతో బాధితులందరికీ పోలీసు విభాగం క్షమాపణలు చెప్పింది. ఫొటోలు తీసుకున్నవాళ్లు వాటిని తమ సహోద్యోగులకు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement