బ్రెయిన్ మ్యాపింగ్ వద్దన్న టుండా.. సరేనన్న కోర్టు | Tunda refuses brain mapping test, court dismisses police plea | Sakshi
Sakshi News home page

బ్రెయిన్ మ్యాపింగ్ వద్దన్న టుండా.. సరేనన్న కోర్టు

Sep 26 2013 4:51 PM | Updated on Sep 1 2017 11:04 PM

బ్రెయిన్ మ్యాపింగ్ వద్దన్న టుండా.. సరేనన్న కోర్టు

బ్రెయిన్ మ్యాపింగ్ వద్దన్న టుండా.. సరేనన్న కోర్టు

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో బాంబుల తయారీలో నిపుణుడైన అబ్దుల్ కరీం టుండా విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు మన్నించింది.

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో బాంబుల తయారీలో నిపుణుడైన అబ్దుల్ కరీం టుండా విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు మన్నించింది. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు వద్దని అతడు కోరగా.. టెస్టు చేయాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల అతడికి బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని తెలిపింది.

చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సల్ ఎదుట హాజరైన టుండా.. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ చేయొద్దని కోరాడు. తన వయసు 72 సంవత్సరాలని, వివిధ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇటీవలే తనకు పేస్ మేకర్ అమర్చారని, హైబీపీతో కూడా బాధపడుతున్నానని తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని కోరాడు. తనకు ఈ పరీక్ష అంటే ఏంటో, దాని పరిణామాలేంటో కూడా తెలుసని కోర్టుకు చెప్పాడు.

భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఉన్న ఉగ్రవాద నెట్వర్కు, అతడి సన్నిహితుల గురించి తెలుసుకోడానికి బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష చేయాలంటూ ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా టుండా తరఫు న్యాయవాది ఎం.ఎస్.ఖాన్ పై విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితుడి అనుమతి లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement