ఫ్యుజిఫిల్మ్ నుంచి మూడు కొత్త ఉత్పత్తులు | Three new products from Mt. Fuji Film | Sakshi
Sakshi News home page

ఫ్యుజిఫిల్మ్ నుంచి మూడు కొత్త ఉత్పత్తులు

Oct 7 2015 12:43 AM | Updated on Sep 3 2017 10:32 AM

ఫ్యుజిఫిల్మ్ నుంచి మూడు కొత్త ఉత్పత్తులు

ఫ్యుజిఫిల్మ్ నుంచి మూడు కొత్త ఉత్పత్తులు

ఫ్యుజిఫిల్మ్ ఇండియా కంపెనీ ఇన్‌స్టాక్స్ మిని రేంజ్‌లో మూడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది.

హైదరాబాద్: ఫ్యుజిఫిల్మ్ ఇండియా కంపెనీ ఇన్‌స్టాక్స్ మిని రేంజ్‌లో మూడు కొత్త  ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో  ఇన్‌స్టాక్స్ సిరీస్ ఇన్‌స్టాక్స్  కెమెరాలను మార్కెట్లోకి తెచ్చామని, ఈ కెమెరాలకు మంచి స్పందన లభిస్తోందని ఫ్యుజిఫిల్మ్ ఎండీ యసునొబు నిషియమ పేర్కొన్నారు. మారుతున్న  భారత యువ వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఈ ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు. ఇన్‌స్టాక్స్ మిని 70 కెమెరా ధర రూ.11,500 అని తెలిపారు. 

శాన్‌రియో కంపెనీ భాగస్వామ్యంతో ఇన్‌స్టాక్స్ మిని హెలో కిట్టీ  కెమెరాను రూపొందించామని ధర రూ.8,900 అని పేర్కొన్నారు. ఈ రెండు కెమెరాల ఫీచర్లు దాదాపు ఒకటేనని చెప్పారు. ఇన్‌స్టాక్స్ కెమెరాల నుంచి తీసుకున్నట్లుగానే స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటొలను ప్రింట్‌లుగా తీసిచ్చే  స్మార్ట్‌ఫోన్ ప్రింటర్.. ఇన్‌స్టాక్స్ షేర్ ధర రూ.14,500 అని వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement