మా సీఎంపైనే కేసు వేస్తావా.. చంపేస్తాం | Threatening letter to Mangalagiri MLA Alla Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

మా సీఎంపైనే కేసు వేస్తావా.. చంపేస్తాం

Sep 13 2016 2:07 AM | Updated on Aug 31 2018 8:31 PM

మా సీఎంపైనే కేసు వేస్తావా.. చంపేస్తాం - Sakshi

మా సీఎంపైనే కేసు వేస్తావా.. చంపేస్తాం

‘ఓటుకు కోట్లు కేసులో మా ముఖ్యమంత్రిపైనే కేసు వేస్తావా.. హైకోర్టులో స్టే తెచ్చుకుంటే మరలా సుప్రీంకోర్టుకు వెళతానని చెబుతావా.

- ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టుకు వెళితే ఇవే చివరి రోజులు

- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బెదిరింపు లేఖ

 సాక్షి, గుంటూరు/మంగళగిరి: ‘ఓటుకు కోట్లు కేసులో మా ముఖ్యమంత్రిపైనే కేసు వేస్తావా.. హైకోర్టులో స్టే తెచ్చుకుంటే మరలా సుప్రీంకోర్టుకు వెళతానని చెబుతావా. ఎంత ధైర్యంరా నీకు.. నీకివే చివరిరోజులు.. నిన్ను మంగళగిరిలోనే చంపేస్తాం’ అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి ఆగంతకుల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ స్థానికంగా కలకలం సృష్టించింది. సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఉండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆర్కేకు పోస్ట్‌మేన్ లేఖ అందజేశారు. దుర్భాషలతో కూడిన బెదిరింపు లేఖ కావడంతో స్థానిక సి.ఐ. బ్రహ్మయ్యకు ఆర్కే ఆ లేఖను అందజేసి ఫిర్యాదు చేశారు.

అనంతరం స్టేషన్ వద్ద ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను అడ్డుకుంటున్నందుకే తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. బాధ్యులను పట్టుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని.. చట్టం ముందు అంతా సమానమేనని, తప్పుచేసిన వారు ముఖ్యమంత్రి అయినా శిక్ష తప్పదన్నారు.బెదిరింపు లేఖపై ఆర్కే సోమవారం రాత్రి గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement