బాలికపై సామూహిక లైంగిక దాడి | Teenage girl gangraped in UP | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక లైంగిక దాడి

Apr 23 2015 8:32 PM | Updated on Sep 3 2017 12:45 AM

పదిహేనేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.

రాయ్బరేలీ: పదిహేనేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. జగత్ పూర్ అనే గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాలిక పొలం పనులకు వెళ్లగా దర్మేశ్ కుమార్, ప్రమోద్ కుమార్, అరవింద్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు బుధవారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారు ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లగా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న తమ కూతురును తల్లిదండ్రులు గుర్తించి తమకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement