టెక్ మహీంద్రా లాభం 27% అప్ | Tech Mahindra April-June quarter net profit up 27 pc to Rs 686.3 crore | Sakshi
Sakshi News home page

టెక్ మహీంద్రా లాభం 27% అప్

Aug 13 2013 5:03 AM | Updated on Sep 1 2017 9:48 PM

తొలి క్వార్టర్‌కు టెక్ మహీంద్రా 27% అధికంగా రూ. 686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

ముంబై:  తొలి క్వార్టర్‌కు టెక్ మహీంద్రా 27% అధికంగా రూ. 686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్-జూన్’12లో రూ. 540 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం కూడా దాదాపు 22% ఎగసి రూ. 4,103 కోట్లకు చేరింది. గతంలో రూ. 3,373 కోట్లు నమోదైంది. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనాన్ని సమర్ధవంతంగా పూర్తిచేశామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. 
 
 డాలర్లలోనూ 
 తొలి క్వార్టర్‌కు డాలర్లలో టెక్ మహీంద్రా నికర లాభం 22% పుంజుకుని 12.1 కోట్లను తాకింది. ఇక ఆదాయం కూడా దాదాపు 18% ఎగసి 72.4 కోట్ల డాలర్లుగా నమోదైంది.
 
 వైస్రాయ్ హోటల్స్  నష్టం రూ.3 కోట్లు
 హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి వైస్రాయ్ హోటల్స్ రూ.17 కోట్ల ఆదాయంపై (కన్సాలిడేటెడ్) రూ.3 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.16 కోట్ల ఆదాయంపై రూ. 2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement