'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే' | tdp mp jc diwakar reddy comments on pawan kalyan | Sakshi
Sakshi News home page

'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే'

Jul 23 2015 2:07 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే' - Sakshi

'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే'

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద గురువారం టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్యలన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూపించడానికి ఇటువంటి ధర్నాలు పనికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రాలకు చింతకాయలు రాలవంటూ ఎద్దేవా చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement