ఆశాజనకంగాలేని స్విస్ బ్యాంకుల స్పందన | Swiss banks response on Black money | Sakshi
Sakshi News home page

ఆశాజనకంగాలేని స్విస్ బ్యాంకుల స్పందన

Jul 6 2014 7:37 PM | Updated on Apr 3 2019 5:16 PM

ఆశాజనకంగాలేని స్విస్ బ్యాంకుల స్పందన - Sakshi

ఆశాజనకంగాలేని స్విస్ బ్యాంకుల స్పందన

బ్లాక్‌మనీ వ్యవహారంపై భారత్‌ ఒత్తిళ్లకు స్విస్‌ బ్యాంకులు స్పందించాయి.

న్యూఢిల్లీ: బ్లాక్‌మనీ వ్యవహారంపై భారత్‌ ఒత్తిళ్లకు  స్విస్‌ బ్యాంకులు స్పందించాయి. అయితే తమకున్న కఠిన నిబంధనలను తాము పాటిస్తామని స్విస్‌ బ్యాంకుల అధికారులు  తెలిపారు. భారత్‌ కోరే సమాచారం న్యాయబద్ధంగా ఉండాలని అవి స్పష్టం చేశాయి. స్విట్జర్లాండ్‌ ఖ్యాతిని భారత్‌ తెలుసుకోవాలని, చట్టబద్ధంగా, న్యాయపరమైన వ్యవస్థ గల తమ దేశ ప్రతిష్టకు అపనమ్మకాల కారణంగా భంగం కలుగుతుందని  స్విస్‌ బ్యాంకులు పేర్కొన్నాయి.

 నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి మంత్రి మండలి సమావేశంలోనే బ్లాక్‌ మనీపై  కఠిన నిర్ణయం తీసుకుంది.  జస్టిస్‌ షా నేతృత్వంలో ఒక కమిటీని కూడా మోడీ  ప్రభుత్వం వేసింది.  ఇటువంటి పరిస్థితుల్లో స్విస్‌ బ్యాంకుల ప్రకటన ఇలా వచ్చింది. కేంద్రం నిర్ణయానికి ఇదేమంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడంలేదు. మనదేశంలో బడాబాబులు దాచుకున్న నల్లధనాన్ని వెలుగులోకి తీసుకురావడం అంత తేలిక కాదని స్సష్టమవుతోంది.

 - శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement