భారత పాస్పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం | suspected Huji terrorists tried for indian passports with fake papers | Sakshi
Sakshi News home page

భారత పాస్పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం

Aug 14 2015 5:05 PM | Updated on Sep 3 2017 7:27 AM

అనుమానిత హుజి (హర్కతుల్ జీహాద్ ఇస్లామీ) ఉగ్రవాదులపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో.. చంచల్గూడ సమీపంలోని ఎంఎం జిరాక్స్ పాయింట్ వద్ద సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు.

అనుమానిత హుజి (హర్కతుల్ జీహాద్ ఇస్లామీ) ఉగ్రవాదులపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో.. చంచల్గూడ సమీపంలోని ఎంఎం జిరాక్స్ పాయింట్ వద్ద సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. నకిలీ పత్రాలతో భారత పాస్పోర్టులు పొందేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ దాడుల్లో తాము ముందుగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మహ్మద్ నజీర్, మసూద్ అలీఖాన్, పర్వేజ్ఖాన్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని విచారించగా, మసూద్ అలీఖాన్ ఇంట్లో మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసి, వాళ్లను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. తాము మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు.

వీళ్లంతా పుట్టుక రీత్యా బంగ్లాదేశీయులని, అక్కడి నుంచి ఆరేడేళ్ల వయసు ఉన్నప్పుడే పాకిస్థాన్ వెళ్లిపోయారని సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. 2010లో భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డారని, ముందుగా ముజఫర్నగర్, పానిపట్ లాంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగారని అన్నారు. గడిచిన మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చారని, అప్పటినుంచి జైపల్లిలోని యునానీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారని వివరించారు. వీళ్లలో మహ్మద్ నజీర్కు హుజితో సంబంధాలు ఉన్నాయని, బంగ్లాదేశ్లోని హుజి ప్రధాన నాయకుడు జబ్బార్తో నిరంతరం టచ్లో ఉంటున్నారని చెప్పారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సోనీని బంగ్లాదేశ్ పంపేందుకు వీళ్లే సాయపడ్డారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement