అవును.. విభజన రాజ్యాంగ విరుద్దమే: చిరంజీవి | state bifurcation is anti constitution,says chiranjeevi | Sakshi
Sakshi News home page

అవును.. విభజన రాజ్యాంగ విరుద్దమే: చిరంజీవి

Oct 26 2013 11:53 AM | Updated on Apr 4 2019 5:53 PM

అవును.. విభజన రాజ్యాంగ విరుద్దమే: చిరంజీవి - Sakshi

అవును.. విభజన రాజ్యాంగ విరుద్దమే: చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి చిరంజీవి ఎట్టకేలకు నోరు విప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి చిరంజీవి ఎట్టకేలకు శనివారం నోరు విప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రుల ఆకాంక్షలను పట్టింకోకుండా విభజనపై కేంద్రం ముందుకు వెళ్లడాన్ని ఎవరు హర్షించరని ఆయన పేర్కొన్నారు. 

 

రాష్ట్ర విభజనను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని, సమైక్య రాష్ట్రానికి ప్రత్యామ్నాయ డిమాండ్లు ఏవీ లేవని ఆయన అన్నారు. విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తోందంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను  సమర్ధిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తెలంగాణ బిల్లు, తీర్మానం రెండిటిని ఖచ్చింతంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపాలని ఆయన కేంద్రాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement