లవర్‌ ప్రెగ్నెంట్‌.. రహస్యంగా సూపర్‌స్టార్‌ పెళ్లి! | star Jackie Chan forced to married | Sakshi
Sakshi News home page

లవర్‌ ప్రెగ్నెంట్‌.. రహస్యంగా సూపర్‌స్టార్‌ పెళ్లి!

Apr 12 2017 11:46 AM | Updated on Sep 5 2017 8:36 AM

లవర్‌ ప్రెగ్నెంట్‌.. రహస్యంగా సూపర్‌స్టార్‌ పెళ్లి!

లవర్‌ ప్రెగ్నెంట్‌.. రహస్యంగా సూపర్‌స్టార్‌ పెళ్లి!

ప్రియురాలు గర్భవతి కావడంతో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని..

హాలీవుడ్‌ టాప్‌ యాక్షన్‌ సూపర్‌ స్టార్‌లలో జాకీ చాన్‌ ఒకరు. ఆయన 2015లో చైనా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా వెలుగులోకి వచ్చి సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. గతంలో ఈ ఇంటర్వ్యూ పెద్దగా వెలుగులోకి రాలేదు. ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చాలా నిజాయితీగా జాకీ చాన్‌ పలు విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాలు జోవన్‌ లిన్‌ గర్భవతి కావడంతో 1982లో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జాకీ స్పష్టం చేశాడు. ఆ తర్వాత తమకు మొదటి కొడుకు పుట్టాడని చెప్పాడు. జోవన్‌ లిన్‌, జాకీ చాన్‌ దంపతులు గత 35 ఏళ్లుగా వైవాహిక జీవితంలో కొనసాగుతున్నారు.

‘అది అనుకోకుండా జరిగింది. లిన్‌ గర్భవతి అవుతుందని, జాయ్‌సీ (కొడుకు) పుడుతాడని నేను అనుకోలేదు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు ఉండేది కాదు. కానీ నాకు బలవంతంగా పెళ్లి చేశారన్న భావన ఇప్పుడు కలుగుతోంది’ అని జాకీ చాన్‌ చెప్పాడు. తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడు తనకు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండేవారని జాకీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. 1982లో లాస్‌ ఏంజిల్స్‌లోని కాఫీషాప్‌లో లిన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు.

జాకీ చాన్‌ లిన్‌తో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూనే.. అనేక మందితో ఎఫైర్లు పెట్టుకున్నాడని రూమర్లు ఉండేవి. మాజీ బ్యూటీక్వీన్‌ ఎలైన్‌ ఎన్‌జీ ఆయన రహస్యంగా ఎఫైర్‌ కొనసాగించాడు. ఆ ఫలితంగా 1999లో జాకీ చాన్‌ కూతురు ఎట్టాకు ఎలైన్‌ జన్మనిచ్చిందని షాంఘైయిస్ట్‌.కామ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కూరుతు ఎట్టాతో జాకీకి ఇప్పుడు అంతంతమాత్రంగానే సంబంధాలు ఉన్నాయట. ఇక, ఆయన కొడుకు 2014లో మాదక ద్రవ్యాలతో బీజింగ్‌లో అరెస్టైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement