తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు

Published Thu, Aug 25 2016 12:21 PM

తెలుగు రాష్ట్రాల్లో  పెరిగిన సిమెంట్ ధరలు

 రెండు తెలుగు రాష్ట్రాల్లో  సిమెంట్ ధరలు పెరిగాయి. బస్తాకి రూ.30-40 మధ్య ధరలు పెరిగాయి.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో   సిమెంట్కు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని ఎనలిస్టులు  చెబుతున్నారు.   ముఖ్య్ంగా రియల్ రంగంపై ప్రభుత్వం దృష్టి,  మంచి వాతారణ వార్తలతో  సిమెంట్  కు డిమాండ్ పెరగనుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో దక్షిణాది సిమెంట్ స్టాక్స్  జోరుమీదున్నాయి.  సాగర్ సిమెంట్ 4.33 శాతం, ఎన్సీఎల్ 4 శాతం రైన్ ఇండస్ట్రీస్ 3.94 శాతం ,  కేసీపీ 3.19 శాతం లాభాలతో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్ ధరలు గత రెండు రోజులలో బ్యాగ్ ధర రూ 30-40 పెరిగినట్టు ఎన్ సీఎల్  ఇండస్ట్రీస్  ఈడీ ఎన్జీవీఎస్జీ ప్రసాద్ తెలిపారు.  సిమెంట్  విక్రయాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో  65-70 శాతం వాటాను సొంతం చేసుకున్న ఎన్ సీఎల్ తమవ్యాపారంపై మరింత ఆశావహంగా ఉంది. 
కాగా గత కొన్ని నెలలుగా సిమెంట్ ధరలు దూకుడు మీదున్నాయి. చాలా షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీంతో ఈ  షేర్లకు  డిమాండ్ బాగానే  పుంజుకుని  మార్కెట్ల ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి.  మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో పలు సిమెంట్‌ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించాయి. మొత్తం 36 సిమెంట్‌ కంపెనీల సంయుక్త నికరలాభం 84 శాతం ఎగసి రూ. 2,823 కోట్లను తాకింది. ముడివ్యయాలు తగ్గడం, సిమెంట్‌ రియలైజేషన్లు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల లాభాలు పెంచాయి.

 

Advertisement
Advertisement