breaking news
cement stocks
-
సిమెంట్ స్టాక్స్- కాంక్రీట్ లాభాలు
లాక్‌డవున్ నిబంధనలను సడలించడం మొదలుపెట్టాక ఈ నెలలో సిమెంటుకు డిమాండ్ ఊపందుకున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా మౌలిక రంగ కార్యకలాపాలు పెరిగినట్లు తెలియజేశాయి. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వేగమందుకున్నట్లు తెలియజేశాయి. అంతేకాకుండా నైరుతి రుతుపవనాల కంటే ముందుగానే నిర్మాణపనులు పూర్తిచేసే యోచనలో గ్రామ ప్రాంతాలలోనూ పనులు ప్రారంభమైనట్లు వివరించాయి. దీంతో పలు కంపెనీలు 60-70 శాతంమేర సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో సిమెంటుకు అంచనాలకు మించి డిమాండ్ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలలో రిటైల్ మార్కెట్లో సిమెంట్ బ్యాగ్‌పై రూ. 20-90 మధ్య ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతాల్లో రూ. 20-30 మధ్య, తూర్పు ప్రాంతాల్లో రూ. 20-50 మధ్య ధరలు బలపడగా.. దక్షిణాదిన మరింత అధికంగా రూ. 40-90 పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో పలు కంపెనీలు ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడం కూడా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సిమెంట్ రంగ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజులుగా గత వారం రోజులుగా పలు సిమెంట్ కౌంటర్లు బలపడుతూ వస్తున్నాయి. బిర్లా కార్పొరేషన్, జేకే లక్ష్మీ సిమెంట్, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంజనీ పోర్ట్లాండ్, కాకతీయ తదితరాలు 8-20 శాతం మధ్య ర్యాలీ చేశాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అల్ట్రాటెక్ నికర లాభం రూ. 1085 కోట్ల నుంచి రూ. 3239 కోట్లకు ఎగసింది. ఇందుకు ప్రధానంగా పన్ను లాభాలు సహకరించాయి. ఇక బిర్లా కార్పొరేషన్ నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 195 కోట్లను తాకింది. అయితే లాజిస్టిక్స్ సమస్యలతో ఆదాయం 9 శాతం క్షీణించి రూ. 1718 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జేకే లక్ష్మీ సిమెంట్ రూ. 99 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. వ్యయాల కట్టడి లాభదాయకతకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. షేర్లు జూమ్ ఆకర్షణీయ ఫలితాల కారణంగా ప్రస్తుతం మరోసారి బిర్లా కార్పొరేషన్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 8.6 శాతం దూసుకెళ్లి రూ. 530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 538 వరకూ ఎగసింది. ఇక జేకే లక్ష్మీ సిమెంట్ 3.6 శాతం ఎగసి రూ. 243 వద్ద కదులుతుంటే.. అంజనీ పోర్ట్‌ల్యాండ్ 6.3 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీ నిలవకపోవచ్చు గతేడాది క్యూ4లో పటిష్ట ఫలితాలు, ఇటీవల సిమెంట్ బ్యాగుపై పెరిగిన ధరలు సిమెంట్ రంగ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. చమురు ధరల పతనం సైతం ముడివ్యయాలు తగ్గేందుకు దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా సిమెంట్ కంపెనీల లాభదాయకత మెరుగుపడే వీలున్నదని అంచనా వేశారు. అయితే కోవిడ్-19 విస్తృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ కొంతకాలం మందగించనుందని, ఫలితంగా సిమెంట్ కౌంటర్లలో ర్యాలీ కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. -
ఇపుడు షేర్లే ఆకర్షణీయం...
రియల్టీ, బంగారానికి వన్నె తగ్గుతోంది డీమోనిటైజేషన్‌తో దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఆశావహంగా ఆటో, బ్యాంకింగ్, సిమెంట్ స్టాక్స్ రియల్ ఎస్టేట్, పసిడి వంటి సాధనాలకు వన్నె తగ్గుతోందని, అందుకే ఇన్వెస్టర్లు ఈక్విటీల వంటి ఫైనాన్షియల్ సాధనాల వైపు మళ్లుతున్నారని చెప్పారు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీఈవో ధీరజ్ రెల్లి. పెద్ద నోట్ల రద్దు అంశం స్వల్పకాలికంగా కష్టం కలిగించినా దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగానే ఉంటుందని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో అభిప్రాయపడ్డారు.ముఖ్యాంశాలివీ... సాక్షి, బిజినెస్ బ్యూరో పెట్టుబడికి ఇపుడు ఏ సాధనాలు బాగున్నాయంటారు? రియల్ ఎస్టేట్, బంగారం వంటి సాధనాలకు ఆకర్షణ తగ్గుతోంది. చాలా మంది ప్రస్తుతం ఫైనాన్షియల్ అసెట్స్ వైపు చూస్తున్నారు. లిక్విడిటీ లేకపోవడం, రేట్ల విషయంలో సందిగ్ధత వంటివి రియల్టీకి ప్రతికూలంగా ఉన్నాయి. చాలా చోట్ల డిమాండ్‌కి మించి నిర్మాణాల కారణంగా నిల్వలు పెరిగిపోయాయి. ఇక వడ్డీ రేట్ల తగ్గుదల, ద్రవ్యోల్బణానికి తగ్గ రాబడి అందించలేకపోవడం వంటి కారణాలతో ఫిక్సిడ్ డిపాజిట్ల కన్నా అధిక రాబడులు అందించే సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఈక్విటీలతోనే ఇది సాధ్యపడుతుంది. అందుకే, కస్టమర్లు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, కొంత మేర నేరుగా ఈక్విటీల్లోనూ, ఐపీవోల మార్గంలోనూ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మా సంస్థపరంగా చూస్తే.. మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించే దిశగా ప్రస్తుతం 270గా ఉన్న శాఖల సంఖ్యను ఈ ఏడాది 300కి పెంచుకుంటున్నాం. దాదాపు 5 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 15–20 శాతం వృద్ధితో సుమారు 7 శాతం స్థాయికి పెంచుకోవాలని యోచిస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. కారణం? భారత్‌లో నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య తక్కువ. వీరి సంఖ్య సుమారు 56 లక్షలుగా ఉంది. అదే ఫండ్స్ పోర్ట్ఫోలియోలైతే సుమారు 5 కోట్ల దాకా ఉన్నాయి. అంటే చాలా మంది రిటైల్ కస్టమర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా.. అందునా సిప్ విధానంలో మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా దాదాపు అర బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,500 కోట్లు) పెట్టుబడులు సిప్ల రూపంలో వస్తున్నాయి. మొత్తంగా ఇటు ఫండ్స్, అటు బీమా సంస్థల నుంచి మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులుంటున్నాయి. అందుకే గత మూడు నెలల్లో ఎఫ్ఐఐలు ఏకంగా 4.5 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలకు దిగినా.. దేశీ సంస్థలు కొనుగోళ్లు జరపగలగడంతో మార్కెట్లు తట్టుకుని నిలబడగలిగాయి. నోట్ల రద్దు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది స్వల్పకాలికంగా కొంత బాధపెట్టినా..దీర్ఘకాలికంగా లాభమే. నవంబర్, డిసెంబర్లలో అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడింది. కానీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అక్టోబర్‌లో వ్యాపారాలు బాగున్నాయి కనుక క్యూ3లో కంపెనీల ఆర్థిక ఫలితాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. నగదు అందుబాటులోకి వస్తోంది కనుక క్యూ4లో పరిస్థితి మామూలుగా ఉండొచ్చు. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ వల్ల పన్నులు కట్టే వారి సంఖ్య పెరుగుతుంది. వచ్చే కొన్నేళ్లలో ప్రస్తుతమున్న దానికన్నా రెట్టింపు స్థాయికి ఇది పెరగొచ్చు. జీఎస్టీ కూడా ఇందుకు తోడ్పడవచ్చు. బడ్జెట్ స్వరూపం ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) లేదా ఎస్టీటీ నిబంధనల్లో వాటిల్లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అయితే, ఆర్థిక మంత్రి సూచనప్రాయంగా చెప్పినట్లు పన్నుల శ్లాబ్‌లు పెంచడం లేదా ఆదాయ పన్ను తగ్గించడం లాంటివేమైనా చేస్తే ప్రజానీకానికి ఊరటగా ఉంటుంది. దీనివల్ల వినిమయంతో పాటు సక్రమంగా పన్నులు కట్టే ధోరణి కూడా పెరగొచ్చు. మార్కెట్‌పై ఈ సంవత్సరం అంచనాలేంటి? ఎన్నికల ఫలితాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, జీఎస్టీ, కార్పొరేట్ల ఆదాయాలు ఈ సారి ప్రభావం చూపించొచ్చు. 2016–17లో ద్రవ్యోల్బణం కొంత తగ్గినా.. 2018 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కింద బకాయిల చెల్లింపులు, అధిక ముడి చమురు ధరలు మొదలైన వాటి కారణంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగొచ్చు. క్రూడ్, కమోడిటీల రేట్లు ప్రతికూలంగా ఉన్నా.. సంస్కరణలను వేగంగా అమలు చేస్తే ఆ ప్రభావం కొంత తగ్గొచ్చు. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ 25–50 బేసిస్ పాయింట్ల మేర కీలక పాలసీ రేట్లు తగ్గించవచ్చు. అయితే, సమీప భవిష్యత్‌లో వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉండగలదన్నది అంచనా వేయలేం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జీఎస్టీ జులై 1 నుంచి అమల్లోకి రావొచ్చు. మరికొద్ది రోజుల్లో వెల్లడయ్యే క్యూ3 ఫలితాల్లో చాలా సంస్థల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయి లేదా అంతకన్నా తక్కువే ఉండొచ్చు. ఏయే రంగాల షేర్లవైపు చూడొచ్చు? ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీ కంపెనీలు... ఆటోæ పరికరాల సంస్థలు, కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు మెరుగ్గా ఉండొచ్చు. పే కమిషన్ సిఫార్సుల అమలు, మెరుగైన రుతుపవనాలతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ఇందుకు దోహదపడొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులపై బులిష్ ధోరణుల విషయంలో మరికొన్నాళ్లు వేచి చూడాలి. ఇక సిమెంటు రంగం విషయానికొస్తే.. రాబోయే రోజుల్లో ఉత్పత్తి సామర్ధ్యం వినియోగం పెరగొచ్చు. ప్రభుత్వం ప్రధానంగా ఇన్ఫ్రా, పరిశ్రమలపై దృష్టి పెడుతుండటం సిమెంటు తయారీ సంస్థలకు సానుకూలంగా ఉంటుంది. ముడిచమురు ధరల తగ్గుదల, ఉత్పత్తులకు డిమాండ్, అధిక రిఫైనింగ్ మార్జిన్ల వంటివి రిఫైనింగ్, చమురు ఉత్పత్తి సంస్థలకు లాభదాయకంగా ఉంటాయి. మెటల్స్ విషయానికొస్తే.. ఫెర్రస్ సంస్థలు బాగుండొచ్చు. స్టాక్స్ విషయానికొస్తే.. న్యూక్లియస్ సాఫ్ట్వేర్, వి–గార్డ్ ఇండస్ట్రీస్, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర షేర్లు ఆశావహంగా ఉన్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. బస్తాకి రూ.30-40 మధ్య ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్‌కు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్య్ంగా రియల్ రంగంపై ప్రభుత్వం దృష్టి, మంచి వాతారణ వార్తలతో సిమెంట్ కు డిమాండ్ పెరగనుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో దక్షిణాది సిమెంట్ స్టాక్స్ జోరుమీదున్నాయి. సాగర్ సిమెంట్ 4.33 శాతం, ఎన్సీఎల్ 4 శాతం రైన్ ఇండస్ట్రీస్ 3.94 శాతం , కేసీపీ 3.19 శాతం లాభాలతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్ ధరలు గత రెండు రోజులలో బ్యాగ్ ధర రూ 30-40 పెరిగినట్టు ఎన్ సీఎల్ ఇండస్ట్రీస్ ఈడీ ఎన్జీవీఎస్జీ ప్రసాద్ తెలిపారు. సిమెంట్ విక్రయాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 65-70 శాతం వాటాను సొంతం చేసుకున్న ఎన్ సీఎల్ తమవ్యాపారంపై మరింత ఆశావహంగా ఉంది. కాగా గత కొన్ని నెలలుగా సిమెంట్ ధరలు దూకుడు మీదున్నాయి. చాలా షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీంతో ఈ షేర్లకు డిమాండ్ బాగానే పుంజుకుని మార్కెట్ల ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో పలు సిమెంట్ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించాయి. మొత్తం 36 సిమెంట్ కంపెనీల సంయుక్త నికరలాభం 84 శాతం ఎగసి రూ. 2,823 కోట్లను తాకింది. ముడివ్యయాలు తగ్గడం, సిమెంట్ రియలైజేషన్లు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల లాభాలు పెంచాయి.