అధికార లాంఛనాలతో ప్రేమ్నాథ్ అంత్యక్రియలు | Soldier Prem Nath Singh cremated with full state honours | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో ప్రేమ్నాథ్ అంత్యక్రియలు

Aug 8 2013 11:28 AM | Updated on Sep 1 2017 9:44 PM

పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో మరణించిన ఐదుగురు భారతీయ సైనికుల్లో ఒకరైన ప్రేమ్నాథ్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో సంహౌతాలో జరిగాయి.

పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో మరణించిన ఐదుగురు భారతీయ  సైనికుల్లో ఒకరైన ప్రేమ్నాథ్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో అతడి స్వగ్రామం సంహౌతాలో గురువారం జరిగాయి. ఆ కార్యక్రమానికి అతని కుటుంబసభ్యులతోపాటు స్థానిక ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. అంతకుమందుకు మంత్రులు,  ప్రభుత్వ అధికారులు, శరన్ జిల్లాలో సంహౌతా గ్రామానికి చేరుకున్న ప్రేమ్నాథ్ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు ఆర్పించారు.

 

జమ్మూలోని పూంచి సెక్టార్లో మంగళవారం పాకిస్థాన్ సైనికులు భారత్లో చొరబడి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఐదుగురు భారతీయ సైనికులు మరణించారు. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. ఆ ఐదుగురు సైనికులు మృతదేహాలు బుధవారం అర్థరాత్రి పాట్నా చేరుకున్నాయి. అక్కడి నుంచి సైనికులు మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో అధికారులు స్వస్థలాలను తరలించారు. మిగతా సైనికులు అంత్యక్రియలకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement