గైర్హాజరుతో సాధించేదేమీ ఉండదు:‘చోగమ్’పై బ్రిటన్ | Skipping summit would 'damage' Commonwealth: UK's William Hague | Sakshi
Sakshi News home page

గైర్హాజరుతో సాధించేదేమీ ఉండదు:‘చోగమ్’పై బ్రిటన్

Nov 10 2013 10:13 PM | Updated on Sep 2 2017 12:30 AM

కొలంబోలో జరగనున్న ‘చోగమ్’ సదస్సుకు గైర్హాజరు కావడం ద్వారా సాధించేదేమీ లేదని, దానివల్ల శ్రీలంకలో సానుకూల మార్పులేవీ రాబోవని బ్రిటిష్ విదేశాంగ మంత్రి విలియమ్ హేగ్ ఆదివారం వ్యాఖ్యానించారు.

లండన్:  కొలంబోలో జరగనున్న ‘చోగమ్’ సదస్సుకు గైర్హాజరు కావడం ద్వారా సాధించేదేమీ లేదని, దానివల్ల శ్రీలంకలో సానుకూల మార్పులేవీ రాబోవని బ్రిటిష్ విదేశాంగ మంత్రి విలియమ్ హేగ్ ఆదివారం వ్యాఖ్యానించారు. కాగా, ఈ సమావేశాల్లో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను తీవ్రంగా ప్రశ్నించనున్నానని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. శ్రీలంక యుద్ధనేరాలపై చానల్-4 ప్రసారం చేసిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలను తాను చూశానని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, ‘చోగమ్’ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, మిగిలిన దేశాల ప్రభుత్వాధినేతలు కూడా ఈ సమావేశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనిపై బీబీసీతో మాట్లాడిన హేగ్, శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా ‘చోగమ్’ బహిష్కరణ పిలుపును అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే, తాము ఈ సమావేశాలను బహిష్కరించబోవడం లేదని స్పష్టం చేశారు. గైర్హాజరు వల్ల ‘కామన్‌వెల్త్’ స్ఫూర్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, దాని వల్ల శ్రీలంకలో సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా లేవని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement