బాంబు పేలి ఆరుగురు దుర్మరణం | Six killed in Afghanistan bombing | Sakshi
Sakshi News home page

బాంబు పేలి ఆరుగురు దుర్మరణం

May 26 2015 11:17 AM | Updated on Nov 6 2018 4:37 PM

బాంబు పేలి ఆరుగురు దుర్మరణం - Sakshi

బాంబు పేలి ఆరుగురు దుర్మరణం

అఫ్గానిస్థాన్లో బాంబు పేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళుతున్న కారు ఒక్కసారిగా బాంబును అమర్చిన పరికరాన్ని తొక్కడంతో భారీ శబ్దంతో విస్ఫోటన చెంది అందులోని వారంత మృత్యువాత పడ్డారు.

కాబుల్: అఫ్గానిస్థాన్లో బాంబు పేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళుతున్న కారు ఒక్కసారిగా బాంబును అమర్చిన పరికరాన్ని తొక్కడంతో భారీ శబ్దంతో విస్ఫోటన చెంది అందులోని వారంత మృత్యువాత పడ్డారు. 'సోమవారం రాత్రి 8.10 గంటల ప్రాంతంలో షా వెయిల్ కోట్ జిల్లాలోని నిఖాషల్లి రోడ్డులో బాంబును అమర్చిన పరికరాన్ని కారుతొక్కడంతో పేలుడు జరిగి అందులోని ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగకమ్ముకుని సమీప ప్రాంతాలు స్వల్ఫంగా ధ్వంసమయ్యాయి. బాంబును తాలిబన్ ఉగ్రవాదులే అమర్చి ఉంటారు' అని ప్రభుత్వ ప్రతినిధి శామిం పాల్ వాక్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement