శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు | sirisha was seriously injured; says post mortem report | Sakshi
Sakshi News home page

శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు

Jun 15 2017 5:25 PM | Updated on Sep 2 2018 3:42 PM

శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు - Sakshi

శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు

బ్యుటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారిన పోస్ట్‌మార్టం నివేదిక బహిర్గతమైంది.

హైదరాబాద్‌: బ్యుటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారిన పోస్ట్‌మార్టం నివేదిక బహిర్గతమైంది. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. గురువారం సాయంత్రం నివేదికను పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు.

శిరీష మెడ, పెదవి, చెంపలపై బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెడ భాగంలో తీవ్రమైన ఒత్తిడి కలగడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు నిర్వహించిన మీదట.. శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనేదానిపై స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పారు.

కాగా, ప్రచారంలో ఉన్నట్లు శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా?అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసులో శిరీష పోస్ట్‌మార్టం నివేదికతో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement