ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు చూడ్డానికి బ్రెజిల్ వెళ్లేందుకు టిక్కెట్ల బుకింగ్‌కు ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలను గోవా రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
పనాజి: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు చూడ్డానికి బ్రెజిల్ వెళ్లేందుకు టిక్కెట్ల బుకింగ్‌కు ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలను గోవా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆరుగురు ఎమ్మెల్యేలు బ్రెజిల్ టూర్‌కు 89 లక్షల రూపాయలు చెల్లించాలన్న ప్రతిపాదన వివాదస్పమైంది. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రెజిల్ టూర్‌కు బుకింగ్ చేసిన టికెట్ల డబ్బును ఈ నెలాఖరులోగా గోవా స్పోర్ట్స్ అథారిటీకి చెల్లించాలని ప్రభుత్వం ఒక మంత్రికి, నలుగురు ఎమ్మెల్యేలకు లేఖలు రాసింది.