
హెలీకాప్టర్ కూలి ఏడుగురు మృతి
జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా కట్రా వద్ద హెలీకాప్టర్ కూలి ఆరుగురు యాత్రికులు, హైదరాబాద్‌కు చెందిన మహిళా పైలట్
కశ్మీర్‌లో ఘటన
మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన పైలట్ సుమిత
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా కట్రా వద్ద హెలీకాప్టర్ కూలి ఆరుగురు యాత్రికులు, హైదరాబాద్‌కు చెందిన మహిళా పైలట్ సుమిత విజయన్ మృతిచెందారు. హిమాలయన్ హెలీకి చెందిన హెలీకాప్టర్.. త్రికూట హిల్స్‌లోని సంజిచాట్ హెలీప్యాడ్ నుంచి వైష్ణోదేవీ ఆలయానికి యాత్రికులను తీసుకుని వస్తుండగా కత్రా కొత్త బస్టాండ్ వద్ద ప్రమాదం జరిగిందని జమ్మూ ఐజీపీ దినేశ్ రాణా తెలిపారు. ఆలయం వద్దకు వస్తున్నప్పుడు చాపర్‌కు పక్షి తగిలి మంటలు చెలరేగాయి. దీంతో చాపర్‌ను బస్టాండ్ వద్ద లాండ్ చేయడానికి యత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట కూడా మృతిచెందింది.
మృతులు అర్జున్ సింగ్, మహేశ్, వందన జమ్మూకు చెందిన వారు కాగా.. సచిన్, అక్షిత(5), అర్యన్‌జీత్ ఢిల్లీ నివాసులు. యాత్రికులకు రూ.25 లక్షల ప్రమాద బీమా ఉందని, అలాగే ఆలయ బోర్డు రూ.3లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి నట్లు వైష్ణోదేవి ఆలయ బోర్డు అదనపు సీఈవో అజిత్ కుమార్ తెలిపారు. కాగా, ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. వైష్ణోదేవీ ఆలయం వద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి.