స్వల్పలాభాలతో సరి | Sensex flat, Nifty ends at 8793; IT stocks rally again | Sakshi
Sakshi News home page

స్వల్పలాభాలతో సరి

Feb 10 2017 4:06 PM | Updated on Sep 5 2017 3:23 AM

దేశీయ బెంచ్మార్కు సూచీలు శుక్రవారం స్వల్పలాభాలతో సరిపెట్టుకున్నాయి.

ముంబై : దేశీయ బెంచ్మార్కు సూచీలు శుక్రవారం స్వల్పలాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 4.55 పాయింట్ల లాభంతో 28334.25 వద్ద, నిఫ్టీ 15.15 పాయింట్ల లాభంలో 8793.55 వద్ద ముగిశాయి. వరుసగా మూడో సెషన్లోనూ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు 0.7-2.9 శాతం లాభపడ్డాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, లుపిన్, హెచ్డీఎఫ్సీ,  ఏసియన్ పేయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం 0.6-2 శాతం డౌన్ అయ్యాయి.
 
మార్కెట్లకు నిరాశకలిగిస్తూ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ ప్రకటించిన అనంతరం కూడా మార్కెట్లు కొంత పునరుద్ధరించుకున్నాయి. వరుసగా మూడో వారాంతంలోనూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అటు ఆసియన్ షేర్ల బూస్ట్ దేశీయ మార్కెట్లకు కొంత కలిసివచ్చింది. డాలర్తో రూపాయి మారకం 0.05 పైసలు లాభపడి 66.80 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 123 రూపాయలు పడిపోయి రూ.28,966గా నమోదైంది. శుక్రవారం మాదిరిగానే నిన్నటి ట్రేడింగ్లో కూడా స్టాక్స్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement