ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Sensex and nifty ends at very flat note | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Feb 13 2017 5:01 PM | Updated on Sep 5 2017 3:37 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి.

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. రోజు మొత్తం ఊగిసలాటలో సాగిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్లు పెరిగి 28,352 వద్ద,  నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో  8,805 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సెక్టార్‌ డీలీ పడగా  ప్రయివేట్ బ్యాంకింగ్‌ షేర్లు లాభాలనార్జించడం విశేషంగా నిలిచింది.   రియల్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది.  ఐటీ లాభపడింది.  

క్యూ3 ఫలితాల  నేపథ్యంలో దాదాపు 11 శాతం నష్టపోయి బీవోబీ, ఐడియా 2.5 శాతం క్షీణించి టాప్‌ లూజర్‌గా నిలిచింది. అరబిందో, భెల్‌, స్టేట్‌బ్యాంక్‌, మారుతీ, బాష్‌, హీరోమోటో, లుపిన్‌, ఐటీసీ నష్టాల్లో  ఐషర్‌, యస్‌బ్యాంక్‌, టాటా పవర్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, జీ, హిందాల్కో, హెచ్‌యూఎల్‌ లాభాల్లో ముగిశాయి.

అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి రూ.67.01 వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో స్వల్పంగా నష్టపోయింది. పది గ్రా. రూ. 29,149 వద్ద కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement