శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..? | Samsungs clamshell smartphone 'veyron's' specifications leaked | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..?

Aug 24 2016 11:35 AM | Updated on Sep 4 2017 10:43 AM

శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..?

శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..?

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్, మరోరూపంలో అవతరించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్, మరో కొత్త రూపంలో అవతరించనుందట. ఎలా అనుకుంటున్నారా..? క్లామ్షెల్ రూపంలో అచ్చం ఫ్లిప్ ఫోన్ మాదిరి ఓ కొత్త స్మార్ట్ఫోన్ను రూపొందించడంలోనే ప్రస్తుతం శాంసంగ్ నిమగ్నమై ఉందట. ఆ కొత్త స్మార్ట్ఫోన్కు గెలాక్సీ ఎస్7కు వాడిన డిజైన్నే శాంసంగ్ వాడనుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ కోడ్ నేమ్ "వెయ్రోన్"గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో గెలాక్సీ ఎస్7 క్లామ్షెల్ రూపంలో అవతరించనుందని తెలుస్తోంది. గ్లాస్, మెటల్ బాడీతో గెలాక్సీ ఎస్7 మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫోన్ రిలీజ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడికాలేదు. చైనాలోనే మొదట లాంచ్ చేయొచ్చని టాక్. గతంలో వచ్చిన రూమర్ ప్రకారం ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగిఉంటుందని తెలుస్తోంది. మొబైల్ టెస్టింగ్ వెబ్సైట్ గీక్బెంచ్లో లిస్టు అయిన ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయ్..

4.2 అంగుళాల డిస్ప్లే
క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
మోడల్ నెంబర్ ఎస్ఎమ్-డబ్ల్యూ2017
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్మాలో
 

Advertisement
 
Advertisement
Advertisement