
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ అవసరం
మోసపూరిత పథకాల నుంచి మదుపరులను రక్షించాల్సిన బాధ్యత ఇటు ఆర్‌బీఐతో పాటు అటు ప్రభుత్వంపైన కూడా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బుధవారం పేర్కొన్నారు.
ముంబై: మోసపూరిత పథకాల నుంచి మదుపరులను రక్షించాల్సిన బాధ్యత ఇటు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)తో పాటు అటు ప్రభుత్వంపైన కూడా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బుధవారం పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రాజ్యభాష పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత పథకాల నుంచి ప్రజలను దూరంగా ఉంచడానికి ద్విముఖ వ్యూహాన్ని ఆయన సూచించారు. ఇందులో ఒకటి ప్రజలను చైతన్యవంతులను చేయడం ఒకటని పేర్కొన్నారు. మరొకటి సామాన్యుని పొదుపులు అధికారిక ఆర్థిక వ్యవస్థకు మరల్చే విధంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచడమని వివరించారు.