హార్వర్డ్‌ కాలేజీ డీన్‌గా భారతీయ అమెరికన్‌ ఫ్రొఫెసర్ | Rakesh Khurana is New Harvard College dean | Sakshi
Sakshi News home page

హార్వర్డ్‌ కాలేజీ డీన్‌గా భారతీయ అమెరికన్‌ ఫ్రొఫెసర్

Jan 23 2014 1:24 PM | Updated on Sep 2 2017 2:55 AM

ప్రోఫెసర్ రాకేష్‌ ఖురానా

ప్రోఫెసర్ రాకేష్‌ ఖురానా

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ కాలేజీ డీన్‌గా భారతీయ అమెరికన్‌ ప్రోఫెసర్ రాకేష్‌ ఖురానాను నియమించారు.

న్యూయార్క్: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ కాలేజీ డీన్‌గా భారతీయ అమెరికన్‌ ప్రొఫెసర్ రాకేష్‌ ఖురానాను నియమించారు. ప్రస్తుతం ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఖురానా 1998లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్  గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమ్మడి కార్యక్రమం ద్వారా పిహెచ్డి పొందారు.

రాకేష్‌ ఖురానాను డీన్గా నియమిస్తున్నట్లు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఎఫ్ఏఎస్) డీన్ మైఖేల్ డి స్మిత్ ఈరోజు ప్రకటించారు. స్కాలర్గా, అధ్యాపకుడుగా కాలేజీ కోసం ఖురానా చేసిన కృషిని ఆయన కొనియాడారు.
 

Advertisement

పోల్

Advertisement