రాధా కె.ప్రశాంతికి స్త్రీ శక్తి పురస్కారం | Radha K Prasanthi gets women power award | Sakshi
Sakshi News home page

రాధా కె.ప్రశాంతికి స్త్రీ శక్తి పురస్కారం

Mar 9 2014 3:52 AM | Updated on Sep 2 2017 4:29 AM

సామాజిక సేవతోపాటు కళారంగంలో విశేష కృషి చేసిన హైదరాబాద్ వాసి టి.రాధా కె.ప్రశాంతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్త్రీశక్తి పురస్కారం (కన్నగి అవార్డు)తో సత్కరించారు.

సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక సేవతోపాటు కళారంగంలో విశే ష కృషి చేసిన హైదరాబాద్ వాసి టి.రాధా కె.ప్రశాంతిని రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ స్త్రీశక్తి పురస్కారం (కన్నగి అవార్డు)తో సత్కరించారు. అవార్డుతో పాటు రూ. 3 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి స్త్రీ శక్తి పురస్కారాలను ప్రణబ్ ప్రదానం చేశారు.
 
  ‘స్టెప్’ స్వచ్ఛంద సంస్థను స్థాపించిన రాధా కె.ప్రశాంతి అనాథలు, వితంతువులు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆర్థిక సాయం చేయడంతోపాటు అంధుల కోసం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రంగస్థల ప్రదర్శనల్లో 208 బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అవార్డులు  అందుకున్నారు. సుమారు 100 చిత్రాల్లో నటించారు. అలాగే మహిళా ఆరోగ్యం కోసం విశేష కృషి చేసిన డాక్టర్ ఎం.వెంకయ్యను కూడా రాష్ట్రపతి స్త్రీ శక్తి పురస్కారాల్లో ఒకటైన రాణీ రుద్రమదేవి అవార్డుతో సత్కరించారు. ప్రకాశం జిల్లాలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకయ్య గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఆరోగ్యం కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement