నా వ్యసనం అదే: ప్రియాంక చోప్రా | Priyanka Chopra, Baywatch Villain, Says Being Bad is an Addiction | Sakshi
Sakshi News home page

నా వ్యసనం అదే: ప్రియాంక చోప్రా

Jul 20 2016 8:12 PM | Updated on Sep 4 2017 5:29 AM

నా వ్యసనం అదే: ప్రియాంక చోప్రా

నా వ్యసనం అదే: ప్రియాంక చోప్రా

చెడ్డ పనులు చేసినా.. చెడుమార్గం పట్టిన వారిని చూసినా సమాజం అంతంగా హర్షించదు. వారి మీద విలన్ ముద్ర వేస్తుంది.

చెడ్డ పనులు చేసినా.. చెడుమార్గం పట్టిన వారిని చూసినా సమాజం అంతంగా హర్షించదు. వారి మీద విలన్ ముద్ర వేస్తుంది. అలా చెడుపనులు చేస్తూ విలన్ ముద్ర వేయించుకోవడం తనకు వ్యసనం లాంటిదని దేశీగర్ల్ ప్రియాంక చోప్రా చెబుతోంది. అమెరికన్ టీవీ షో 'క్వాంటికో'లో నటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ మూవీ 'బేవాచ్'లో విలన్ పాత్ర పోషిస్తోంది. ఇలా విలన్ పాత్ర పోషించడంపై స్పందిస్తూ.. 'చెడ్డపనులు చేయడం నాకు వ్యసనం లాంటిది. నిజానికి అలాంటి వాటిని నిజజీవితంలో చేయలేం. కాబట్టి తెరపై చెడ్డపాత్రలో కనిపించడం నాకు ఇష్టమే' అంటోంది.

90వ దశకంలో పాపులర్ అయిన టీవీ సిరీస్ 'బేవాచ్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. విక్టోరియా లీడ్స్‌ పాత్ర ప్రియాంక పోషించింది. తాజాగా కెనడియన్ ఫ్యాషన్ మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఈ పాత్ర గురించి వివరిస్తూ హీరో ద్వేన్ జాన్సన్ పాత్ర మంచితనానికి ప్రతిరూపంగా ఉంటే.. విక్టోరియా పాత్ర మాత్రం కుళ్లుతో నిండి ఉంటుందని, ఎప్పుడూ చెడు తలపెడుతుందని, ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర పోషించడం తన జీవితంలో బెస్ట్ థింగ్ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement