బాహుబలి ప్రమోషన్‌లో రానా, ప్రభాస్‌ కుస్తీ | Prabas and I in the University of Chandigarh promoting and celebrating #BaahubaliTheConclusion | Sakshi
Sakshi News home page

బాహుబలి ప్రమోషన్‌లో రానా, ప్రభాస్‌ కుస్తీ

Apr 14 2017 6:35 PM | Updated on Aug 11 2019 12:52 PM

ప్రతిష్టాత్మక బాహుబలి మూవీలో పోటాపోటీ నటనతో ఆకట్టుకున్న యంగ్‌ హీరోలు ప్రభాస్‌, రానా కుస్తీ పట్టు పట్టడం ఆసక్తికరంగా నిలిచింది

చండీగడ్‌: ప్రతిష్టాత్మక బాహుబలి మూవీలో  నటించిన ప్రత్యర్థులు మరోసారి పోటీకి తలపడ్డారు. ఈ చిత్రం మొదటి భాగంలో  పోటాపోటీ నటనతో ఆకట్టుకున్న యంగ్‌ హీరోలు ప్రభాస్‌, రానా టేబుల్‌పై చేతులతో బలంగా ఓ పట్టు పట్టడం ఆసక్తికరంగా నిలిచింది. అయితే మాహిష్మతి సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం రీల్‌ లైఫ్‌లో హోరా హోరగా తలపడిన వీరిద్దరూ తాజాగా రియల్‌ లైఫ్‌ లో  సరదాగా పోటీ పడ్డారు.

బాహుబలి సిరీస్‌ లో రెండవ భాగం బాహుబలి ద కన్‌క్లూజన్‌  ప్రమోషన్‌ లో భాగంగా  బల్లాలదేవ, బాహుబలి హల్‌ చల్‌ చేశారు. ఇలా ఓ పట్టుపట్టి అక్కడున్న వారిని అలరించారు.   హ్యాండ్‌ సమ్‌  లుక్‌ లో  అదరగొడుతున్న తమ అభిమాన హీరోలు చేసిన  సందడితో ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ చండీగడ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.  ఈ విషయాన్ని బల్లాలదేవ ట్విట్టర్‌ ద్వారా  అభిమానులతో  పంచుకున్నారు.

బాహుబలి 2రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌ '   ఏప్రిల్‌ నెల 28న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను పలకరించనుంది. అయితేఈ  సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు  శరవేగంగా జరుగుతున్నాయి. మరో  మద్రాస్ హైకోర్టులో ఈ సినిమా రిలీజ్ నిలిపి వేయాలని  కొన్ని కన్నడ సంఘాలు పిటీషన్ దాఖలు చేశాయి. అంతేకాదు కర్నాటకలో సినిమా విడుదల అడ్డుకుంటామంటూ  ఏప్రిల్ 28న బెంగుళూరు బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement