
ఇమ్రాన్ ఖాన్ ఇంటికి కరెంట్ కట్
పాకిస్థాన్ తెహరీక్ ఇన్పాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహరీక్ ఇన్పాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాలాటియల్ లోని ఆయన ఇంటికి అధికారులు కరెంట్ కట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ లక్ష రూపాయలు పైగా విద్యుత్ బకాయిలు ఉండడంతో ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు ఇస్లామాబాద్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అధికారులు తెలిపారు.
కరెంట్ బిల్లు కట్టకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని గతంలో నోటీసు ఇచ్చినా ఇమ్రాన్ ఖాన్ స్పందించలేదని వెల్లడించారు. కరెంట్ బిల్లులు, పన్నులు కట్టొద్దని ఆగస్టు నెలలో పాకిస్థాన్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. నవాజ్ షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి దించేందుకు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ పిలుపునిచ్చారు.