వారెవ్వా పోలీస్‌.. సాక్షాత్తు పోలీసు స్టేషన్‌ లోపలే! | Sakshi
Sakshi News home page

వారెవ్వా పోలీస్‌.. సాక్షాత్తు పోలీసు స్టేషన్‌ లోపలే!

Published Thu, Mar 16 2017 1:50 PM

వారెవ్వా పోలీస్‌.. సాక్షాత్తు పోలీసు స్టేషన్‌ లోపలే! - Sakshi

పోలీసు వృత్తి అంటేనే ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నది. సమాజం గాడితప్పకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ పోలీసులే గాడితప్పారు. హోలీ ఆడుతూ మందుకొట్టారు. అది కూడా సాక్షాత్తూ పోలీసు స్టేషన్‌ లోపలే. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.

హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పోలీసు స్టేషన్‌లోపలే పోలీసులు రంగులు చల్లుకున్నారు. అంతటితో ఆగకుండా బీర్లు తాగారు. పోలీసు దుస్తుల్లోనే మందుకొట్టారు. ఇది కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది

Advertisement
Advertisement