ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఫిలిప్పీన్స్‌దే! | Philippines airport terminal 'world's worst' :online travel website | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఫిలిప్పీన్స్‌దే!

Oct 18 2013 7:04 PM | Updated on Sep 1 2017 11:45 PM

ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఏదీ? అంటే ఫిలిప్పీన్స్ విమానాశ్రయమేనంటోంది ఓ ట్రావెల్ వెబ్‌సైట్ సర్వే!

మనీలా: ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఏదీ? అంటే ఫిలిప్పీన్స్ విమానాశ్రయమేనంటోంది ఓ ట్రావెల్ వెబ్‌సైట్ సర్వే! ఈ సైట్ నిర్వహించిన సర్వేలో వరుసగా రెండో ఏడాది ఫిలిప్పీన్స్ ఈ ‘అతి చెత్త’ స్థానంలో నిలిచింది. అయితే దేశాధికారులు మాత్రం ఆ వెబ్‌సైట్ ఫలితాలను తోసిపుచ్చుతున్నారు. విమానాశ్రయంలో తాము సౌకర్యాలను బాగానే మెరుగుపరిచామని అంటున్నారు. ‘ద గైడ్ టు స్లీపింగ్ ఇన్ ఎయిర్‌పోర్ట్స్’ వెబ్‌సైట్.. ఈ సర్వే చేసింది. సౌకర్యం, శుభ్రత, వినియోగదారునికి సేవలు, ఇతర ఏర్పాట్లపై ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిలిప్పీన్స్‌పై ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

 

ఇక్కడి సౌకర్యాలు శిథిలావస్థలో ఉన్నాయని, విమానాశ్రయ సిబ్బంది ప్రత్యేకించి ట్యాక్సీ డ్రైవర్లు.. ప్రయాణికులకు గౌరవమే ఇవ్వరని, ఇక్కడ వెయిటింగ్ సమయం చాలా ఎక్కువని, అధికారులు కూడా చాలా మూర్ఖంగా ఉంటారని ప్రయాణికులు వెబ్‌సైట్‌లో అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement