అవిశ్వాసానికి పట్టుబడితే వాయిదావేశారు : మైసూరా | Parliament session nominal : Mysura Reddy | Sakshi
Sakshi News home page

అవిశ్వాసానికి పట్టుబడితే వాయిదావేశారు : మైసూరా

Dec 18 2013 2:51 PM | Updated on May 29 2018 4:06 PM

అవిశ్వాసానికి పట్టుబడితే వాయిదావేశారు : మైసూరా - Sakshi

అవిశ్వాసానికి పట్టుబడితే వాయిదావేశారు : మైసూరా

తమ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై పట్టుబడితే లోక్సభను వాయిదావేశారని వైఎస్ఆర్ సిపి సిడబ్ల్యూసి సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి చెప్పారు.

న్యూఢిల్లీ: తమ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై పట్టుబడితే లోక్సభను వాయిదావేశారని వైఎస్ఆర్ సిపి సిజిసి సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి చెప్పారు. లోక్బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులు సమైక్యనినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. సమైక్య నినాదాల హోరులో సభ జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌  నిరవధికంగా వాయిదా వేశారు.  

అనంతరం మైసూరా రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ సమావేశాలను మొక్కుబడిగా నడిపించారని విమర్శించారు.  లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతిస్తూ స్పీకర్‌కు తాము లేఖ ఇచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 సవరణపై చర్చజరిగాలని వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు.  ప్రభుత్వానికి సమస్యలపై చర్చించే చిత్తశుద్ధిలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందిన తరువాత  అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేశారని మైసూరా రెడ్డి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement