కశ్మీర్లో ఉగ్రవాది హతం | One Terrorist Killed in Gunbattle in J&K's Shopian | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో ఉగ్రవాది హతం

Nov 7 2016 9:24 AM | Updated on Sep 4 2017 7:28 PM

జమ్ము కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో భద్రత దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి.

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత స్థావరాలపై వరుసగా దాడి  చేస్తుండగా, మరోవైపు ఉగ్రవాదులు మాటువేసి భద్రత దళాలపై దాడులకు పాల్పడుతున్నారు. భారత భద్రత దళాలు దీటుగా స్పందిస్తూ దాడులను తిప్పికొడుతున్నాయి.

సోమవారం ఉదయం జమ్ము కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో భద్రత దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. కాగా ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరణించిన ఉగ్రవాదిని సదామ్ హుస్సేన్గా గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement