'మేం గెలిస్తే ఆయనే సీఎం' | On Day 1 of Bihar Polls, a Name Surfaces for NDA Chief Minister | Sakshi
Sakshi News home page

'మేం గెలిస్తే ఆయనే సీఎం'

Oct 12 2015 4:05 PM | Updated on Mar 29 2019 9:31 PM

'మేం గెలిస్తే ఆయనే సీఎం' - Sakshi

'మేం గెలిస్తే ఆయనే సీఎం'

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పట్నా:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం గయాలో పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రేమ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బిహార్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది.

బిహార్లో బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తిగా ప్రేమ్ కుమార్కు మంచి పేరుంది. బీజేపీ సాధారణంగా ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించడం అరుదు. బిహార్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత షాన్వాజ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
Advertisement