రైల్వే శాఖ అందించిన‘చల్లని’ వార్త

రైల్వే శాఖ అందించిన ‘చల్లని’ వార్త


న్యూఢిల్లీ: ఏసీ కోచ్‌ల్లో లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రయాణాలను చేయాలనుకున్నా, టికెట్లు దొరక్క ఇబ్బుందులు పడుతున్న  ప్రయాణికులకు  రైల్వేశాఖ ఓ శుభవార్త అందించింది.  సుదూరం ప్ర‌యాణించే రైళ్ల‌లో థర్డ్‌ ఏసీ  బోగీల‌ను పెంచాల‌ని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఎయిర్ కండిషన్డ్   కోచ్‌లకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో రైల్వేశాఖ  ఈ  యోచన చేస్తోంది. థార్డ్ ఏసీ ప్ర‌యాణికుల ద్వారా ఆదాయం బాగా వ‌స్తోంద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి చెప్పారు. కొన్నిదూరపు  రైళ్లలో క్రమంగా ఏసీ బోగీలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 


గత ఏడాది  సీజ‌న్‌లో ప్ర‌యాణికుల నుంచి వ‌స్తున్న ఆదాయంలో32శాతం థర్డ్‌ ఏసీనుంచి వ‌చ్చిన‌ట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. స్లీప‌ర్ క్లాస్ బోగీల ద్వారా సుమారు 44 శాతం ఆదాయం  సమకూరింది.  ఇటీవ‌ల కేవ‌లం థార్డ్ ఏసీ బోగీల‌తో రైల్వేశాఖ హ‌మ్‌స‌ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. ఆ రైలుకు మంచి స్పంద‌న వ‌స్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.  గత ఏడాది ఏప్రిల్ నుంచి 2016 మార్చి 2017 వరకు 33.65 శాతానికి పెరిగిన ప్రయాణీకుల వాటాతో పోల్చుకుంటే వాటా పెరుగుదల 16.69 శాతం నుంచి 17.15 శాతానికి పెరిగింది. ప్రయాణీకుల ఆదాయం 32.60 శాతం నుంచి 33.65 శాతానికి పెరిగాయని రైల్వే గణాంకాలు చెబుతున్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top