నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ రోలోవర్స్.... | Nifty futures contract in the short rolovars .... | Sakshi
Sakshi News home page

నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ రోలోవర్స్....

Oct 31 2013 2:32 AM | Updated on Sep 2 2017 12:08 AM

నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి నవంబర్ కాంట్రాక్టుకు వరుసగా రెండురోజులపాటు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ జరగ్గా, బుధవారం మాత్రం షార్ట్ రోలోవర్స్ ఊపందుకున్నట్లు డేటా సూచిస్తున్నది.

నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి నవంబర్ కాంట్రాక్టుకు వరుసగా రెండురోజులపాటు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ జరగ్గా, బుధవారం మాత్రం షార్ట్ రోలోవర్స్ ఊపందుకున్నట్లు డేటా సూచిస్తున్నది. స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరువవుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఇన్వెస్టర్లు వారి క్యాష్ పోర్టఫోలియోలను సంరక్షించుకోవడానికి కొద్దిమోతాదులో నిఫ్టీ ఫ్యూచర్‌లో షార్ట్ పొజిషన్లను రోలోవర్ చేసుకున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
 తాజాగా నవంబర్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో  27 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.88 కోట్ల షేర్లకు పెరిగింది. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందురోజున..అంటే సెప్టెంబర్ 25న అక్టోబర్ నిఫ్టీ ఫ్యూచర్ మొత్తం ఓఐ 1.36 కోట్ల షేర్ల మేరకే వుంది. అక్టోబర్ సిరీస్ ప్రారంభంలో స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ. 55 వుండగా, నవంబర్ ఫ్యూచర్లో ఇప్పుడది రూ. 48కు పరిమితమయ్యింది. క్రితం రోజుతో పోల్చిచూసినా ప్రీమియం రూ. 9వరకూ తగ్గడం షార్ట్ రోలోవర్స్‌కు సంకేతం.  ఈ దఫా అటు లాంగ్, ఇటు షార్ట్ రోలోవర్స్ జోరుగా పెరగడంతో ఓఐ 2 కోట్ల షేర్లకు చేరువవుతున్నది. రానున్న కొద్దిరోజుల్లో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఈ అధిక ఓపెన్ ఇంట్రస్ట్ సూచిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement