మాజీ ప్రధానుల పేర్లు తొలగించిన ఎన్డీఏ | NDA govt drops Indira, Rajiv's name from two Hindi awards | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధానుల పేర్లు తొలగించిన ఎన్డీఏ

Apr 21 2015 9:26 PM | Updated on Sep 3 2017 12:38 AM

మాజీ ప్రధానుల పేర్లు తొలగించిన ఎన్డీఏ

మాజీ ప్రధానుల పేర్లు తొలగించిన ఎన్డీఏ

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తనముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తనముద్ర  వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేరుతో కొనసాగుతున్న రెండు అవార్డులకు పేర్లు మార్చింది. ఇందిర, రాజీవ్ పేర్లను తొలగించి కొత్త పేర్లు పెట్టింది.

హిందీ భాష ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ రాజభాష పురస్కార్, రాజీవ్ గాంధీ రాష్ట్రీయ- విజ్ఞాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్ పేర్లను మార్చినట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. రాజభాష కీర్తి పురస్కార్, రాజభాష గౌరవ్ పురస్కార్ గా నామకరణం చేసినట్టు వెల్లడించింది. అయితే అవార్డుల పేర్ల మార్పు వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement