'వైఎస్ జగన్‌ను చంపేందుకు సర్కార్ కుట్ర' | MLA rajanna dora slams ap government | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్‌ను చంపేందుకు సర్కార్ కుట్ర'

Oct 12 2015 1:24 PM | Updated on Apr 4 2018 9:25 PM

'వైఎస్ జగన్‌ను చంపేందుకు సర్కార్ కుట్ర' - Sakshi

'వైఎస్ జగన్‌ను చంపేందుకు సర్కార్ కుట్ర'

రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోందిని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు.

సాలూరు : రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోందిని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను ఆశించి దీక్షకు దిగిన జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రులు కామినేని, ప్రత్తిపాటి హేళన చేయడం దుర్మార్గమని చెప్పారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను లాక్కోవడంతో పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతారహితంగా మాట్లాడిన మంత్రులను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement