అరగుండు, చెప్పులదండ, నగ్నంగా.. | Sakshi
Sakshi News home page

అరగుండు, చెప్పులదండ, నగ్నంగా..

Published Mon, May 22 2017 8:37 AM

అరగుండు,  చెప్పులదండ, నగ్నంగా..

ముంబై: ఆకలేసి తప్పు చేసిన ఇద్దరు  మైనర్‌ బాలురు పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఉల్హస్‌ నగర్‌లో శనివారం ఉదయం ఈ ఉందంతం చోటు చేసుకుంది.  స్థానిక షాపులోంచి తినుబండారాలను  దొంగిలించిన  ఇద్దరు మైనర్‌   బాలుళ్ల పట్ల ఆ షాపు  షాపు యజమాని అవమానకరంగా, నిర్దయగా ప్రవర్తించారు. బాలుర మెడలో  చెప్పుల దండ వేసి, నగ‍్నంగా   ఊరేగించారు.   
పొలీసులు అందించిన సమాచారం ప్రకారం 8,9 సం.రాల ఇద్దరు అబ్బాయిలు  మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగిలించారు.  ఇది గమనించిన పఠాన్‌, అతని ఇద్దరుకు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20)  వీళ్లపై విరుచుకుపడ్డారు.  తీవ్రంగా కొట్టారు. అనంతరం అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా ఆ పిల్లల్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు.  ఈ దృశ్యాలను స్థానినికులు  చిత్రీకరించి  సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో  ఈ వీడియో  వైరల్‌గా మారింది. బాధితుల తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు  ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఉల్హస్‌ నగర్, హిల్ లైన్ పోలీసు స్టేషన్,  సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.  ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌  ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్స్‌ యాక్ట్‌  కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.  నిందితులను కోర్టుముందు హాజరు పర్చి, సోమవారం వరకు రిమాండ్‌ చేసినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement