మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం | Minor girl gangraped in Haryana | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Oct 1 2013 12:25 PM | Updated on Sep 1 2017 11:14 PM

హర్యానాలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురయింది. జింద్ జిల్లా రాజానా కుర్ద్ గ్రామంలో ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు.

జింద్: హర్యానాలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురయింది. జింద్ జిల్లా రాజానా కుర్ద్ గ్రామంలో ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. సోమవారం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. 15 ఏళ్ల బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లినప్పుడు దుండగులు ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు.

నిందితులు పవన్, నరేందర్, దాల్షర్గా గుర్తించారు. ఈ ముగ్గురు రాజానా కుర్ద్ గ్రామానికే చెందిన వారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితులపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement