ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ! | MH17 victim conferred with Master's degree | Sakshi
Sakshi News home page

ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!

Oct 15 2014 5:29 PM | Updated on Sep 2 2017 2:54 PM

ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!

ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!

మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మరణించిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీని మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ప్రధానం చేసింది

కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మరణించిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీని మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ప్రధానం చేసింది. ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. 
 
ఎలిజబెత్  మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా అర్హత సాధించిందని యూనివర్సిటీ డీన్ నాజ్రీ ఇస్మాయిల్ తెలిపారు. మాస్టర్ డిగ్రీ పొందడానికి ఒక సబ్జెక్ట్, మరో రీసర్చ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం 80 శాతం పూర్తి చేసి.. మరణించిన వారికి యూనివర్సిటీ డిగ్రీని అందచేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement