‘గూగుల్’తో భోజనం ఆర్డర్! | Meal can be ordered on google with Place on order | Sakshi
Sakshi News home page

‘గూగుల్’తో భోజనం ఆర్డర్!

Aug 10 2016 9:47 AM | Updated on Sep 4 2017 8:43 AM

‘గూగుల్’తో భోజనం ఆర్డర్!

‘గూగుల్’తో భోజనం ఆర్డర్!

మనం ఇప్పటి వరకు ఆహారాన్ని ఇంటి వద్దకు తెప్పించుకోవాలంటే స్విగ్గీ, జోమాటో వంటి యాప్‌లను ఆశ్రయించే వాళ్లం.

న్యూఢిల్లీ: మనం ఇప్పటి వరకు ఆహారాన్ని ఇంటి వద్దకు తెప్పించుకోవాలంటే స్విగ్గీ, జోమాటో వంటి యాప్‌లను ఆశ్రయించే వాళ్లం. యాప్‌లతో సంబంధం లేకుండా ఆహారాన్ని బుక్ చేసుకునే వెసులుబాటును అందిస్తోంది టెక్నాలజీ దిగ్గజం గూగుల్. మొబైల్ ఫోన్ ద్వారా గూగుల్ సెర్చ్‌లో మన దగ్గర్లోని హోటళ్లు, రెస్టారెంట్లను సెర్చ్ చేస్తున్న సమయంలో ‘ప్లేస్ ఆన్ ఆర్డర్’ని క్లిక్ చేసి ఆయా హోటళ్లలోని నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

అంతేకాకుండా రెస్టారెంట్లకు వెళ్లాలనుకునే వారు ఇంటి నుంచే టెబుల్‌ని కూడా బుక్ చేసుకునే వీలును కల్పిస్తున్నారు. గూగుల్ ఈ సేవలను మంగళవారం ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 10 పట్టణాల్లోని  11వేల రెస్టారెంట్లలో ఈ సేవలను అందుబాటులో తెచ్చారు. త్వరలోనే మిగత అన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement