ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడే రావాలా? | Manjhi questions Modi's Jharkhand visit during bypoll in Bihar | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడే రావాలా?

Aug 21 2014 5:02 PM | Updated on Aug 21 2018 9:38 PM

ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడే రావాలా? - Sakshi

ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడే రావాలా?

ప్రధాని నరేంద్ర మోడీ- జార్ఖండ్ పర్యటపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు.

పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ- జార్ఖండ్ పర్యటపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీహార్ లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో పొరుగున్న జార్ఖండ్ లో పర్యటనకు రావాలా అంటూ నిలదీశారు.

జార్ఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శ్రీకారం చుట్టడం, పలుచోట్ల ప్రసంగాలు చేయడంపై జితన్ రామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మోడీ జార్ఖండ్ పర్యటనపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు.

మోడీ ప్రభంజనం తగ్గిపోయిందన్నారు. బూటకపు హామీలతో సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. భవిష్యత్ లో మోడీ మ్యాజిక్ పనిచేయదని జితన్ రామ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement