ఏటీఎంలో కార్డు పెట్టగానే 'షాక్' | Man inserts ATM card, gets electrocuted | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో కార్డు పెట్టగానే 'షాక్'

Jul 7 2015 9:20 AM | Updated on Sep 3 2017 5:04 AM

ఏటీఎంలో కార్డు పెట్టగానే 'షాక్'

ఏటీఎంలో కార్డు పెట్టగానే 'షాక్'

ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లి సదరు మెషిన్లో కార్డును ఇన్సర్ట్ చేయగానే బ్రిజేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది.

అలహాబాద్ : ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లి సదరు మెషిన్లో కార్డును ఇన్సర్ట్ చేయగానే బ్రిజేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోజంగాయిలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఉల్కిపడిన బ్రిజేష్... బ్యాంక్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు సదరు ఏటీఎం వద్దకు చేరుకున్నారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగంబర్ కుష్వాన్ మాట్లాడుతూ...  బ్రిజేష్ కుమార్ వర్షంలో పూర్తిగా తడిసి... ఏటీఎంలో నగదు డ్రా చేసే ప్రయత్నంలో షాక్ కొట్టి ఉంటుందని తెలిపారు. అదికాక ఏటీఎం ఉన్న భవంతి అత్యంత పురాతనమైనదని... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవంతి పూర్తిగా తడిసిపోయిందని వెల్లడించారు. అంతేకాకుండా మెషిన్లో వైరింగ్ తేడా వల్ల కూడా ఇలా జరిగే అస్కారం ఉండవచ్చని ఆయన తెలిపారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది మెషిన్ను పరిశీలిస్తున్నారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement