సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధాని ఫోటో సర్క్యూలేట్ చేస్తూ పట్టుబడ్డాడు!
Nov 25 2016 5:12 PM | Updated on Sep 17 2018 7:44 PM
మోరెనా : సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ షాపు నడుపుతున్న అస్లాం ఖాన్ అనే వ్యక్తి, ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్నాడని బన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఆత్మారాం శర్మ తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోపై బన్మోర్ డివిజన్ ప్రెసిడెంట్ రాంబారన్ మావై ఆధ్వర్యంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా బన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు స్టేషన్ ముందు నిరసనకు దిగినట్టు చెప్పారు. అదుపులోకి తీసుకున్న అస్లాం ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదుచేశామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు శర్మ చెప్పారు.
Advertisement
Advertisement